సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. కేజీఎఫ్ న‌టుడు క‌న్నుమూత‌

Sandalwood actor Mohan Juneja no more.సినీ ప‌రిశ్ర‌మలో విషాదం చోటు చేసుకుంది. శాండ‌ల్‌వుడ్‌ న‌టుడు మోహ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2022 5:17 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. కేజీఎఫ్ న‌టుడు క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మలో విషాదం చోటు చేసుకుంది. శాండ‌ల్‌వుడ్‌ న‌టుడు మోహ‌న్ జునేజా క‌న్నుమూశారు. గ‌త‌కొంత‌కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న్ను కుటుంబ స‌భ్యులు చిక్క‌బాణ‌వ‌ర స‌ప్త‌గిరి ఆస్ప‌త్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు శాండ‌ల్ వుడ్ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో మోహన్‌ జునేజా జన్మించారు. బెంగళూరులోనే విద్యాభ్యాసం చేసి అక్కడే స్థిరపడ్డారు. క‌న్న‌డ‌లో 'జోగి' చిత్రంలో ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అనంత‌రం త‌న సుదీర్ఘ కెరీర్‌లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో న‌టించారు. 'చెల్లాట' చిత్రం ఆయన కెరీర్‌కు మాంచి బ్రేక్‌ ఇచ్చింది. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ న‌టించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌ర‌య్యారు. బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచిన 'కేజీఎప్‌', 'కేజీఎఫ్‌-2' చిత్రాల్లో కూడా ఆయన నటించారు.

Next Story