రాధేశ్యామ్‌.. ఆక‌ట్టుకుంటున్న 'సంచారి' పాట

Sanchari song release from Radheshyam movie.బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 11:57 AM IST
రాధేశ్యామ్‌.. ఆక‌ట్టుకుంటున్న సంచారి పాట

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన చిత్రం 'రాధే శ్యామ్‌'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర ప్రమోషన్ వీడియోలు, పాటలకు సీనీ అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోండ‌గా.. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట 'సంచారి'ని విడుద‌ల చేసింది.

'కొత్త నేలపై.. గాలి సంతకం' అంటూ ఈ పాట సాగుతోంది. సినిమాలోని ప్రభాస్​ క్యారెక్టర్​ను రిప్రజెంట్ చేసేలా ఉంది. లవర్​బాయ్​గా.. లైఫ్ ఎంజాయ్​ చేసే క్యారెక్టర్​లో ప్రభాస్​ కనిపించారు. పాటలో లోకేషన్స్​ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం బాష‌ల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది. తెలుగు పాటలకు జస్టిన్ ప్రభాకరన్​​ సంగీతం అందించగా.. హీందీ వెర్షన్​కు మిథూన్​, అమాల్​ మాలిక్​, మనన్ భరద్వాజ్​ సంగీతం అందించారు.

కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూర‌ప్ నేప‌థ్యంలో సాగే పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరి ఇది. ఇందులో ప్ర‌భాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తుంది. ప్రభాస్ పాత్రకి చేతి రేఖలను చూసి భవిష్యత్తుని చెప్పేసే శక్తి ఉంటుంది. తను ప్రేయసి పూజా హెగ్డే చేతి రేఖలను చూసి ఆమెకు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని గ్రహించి ఆమెను ఎలా కాపాడుకున్నాడనేదే రాధే శ్యామ్ కథాంశం అని సినిమా గురించిన స్టోరి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Next Story