షూటింగ్‌లో సెట్స్‌లో బ‌ర్నింగ్ స్టార్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..

Sampoornesh babu gets hurt in Bajaru rowdy shooting.బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తృటిలో ప్ర‌మాదం నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jan 2021 9:37 AM GMT
షూటింగ్‌లో సెట్స్‌లో బ‌ర్నింగ్ స్టార్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. షూటింగ్‌లో భాగంగా బైక్‌పై స్టంట్స్ చేస్తున్న క్ర‌మంలో అదుపు త‌ప్పి కింద‌ప‌డ్డారు. ఈఘ‌ట‌న‌లో ఆయ‌న స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. సంపూర్ణేష్ బాబు హీరోగా 'బ‌జారు రౌడీ' అనే చిత్రం తెర‌కెక్కుతోంది. తాజాగా చిత్రంలోని కొన్ని ఫైట్ సీన్లను చిత్రీక‌రిస్తున్నారు. బైక్‌తో పాటు గాల్లో ఉండే షాట్ తీస్తున్నారు. ఈక్ర‌మంలో బైక్‌ను తాడుతో క‌ట్టి కింద‌కు దింపుతుండ‌గా.. అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోయారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అక్క‌డికి చేరుకుని సంపూను పైకి లేపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. ఈ చిత్రాన్ని వ‌సంత నాగేశ్వ‌ర రావు ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు.


Next Story
Share it