క్యాలీఫ్ల‌వ‌ర్ ట్రైల‌ర్‌.. పొట్ట చెక్క‌లే

Sampoornesh Babu Cauliflower trailer out.బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం క్యాలీఫ్ల‌వ‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2021 8:00 AM GMT
క్యాలీఫ్ల‌వ‌ర్ ట్రైల‌ర్‌.. పొట్ట చెక్క‌లే

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం 'క్యాలీఫ్ల‌వ‌ర్‌'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. ఆర్కే మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సంపూ స‌ర‌స‌న వాసంతి న‌టిస్తోంది. గూడూరు శ్రీధర్‌ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందుబాగంగా నేడు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

శీలం ఆడాళ్లకే కాదు.. మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే విభిన్నమైన కాన్సెప్టుతో ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా చిత్రం తెర‌కెక్కింద‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థం అవుతోంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో తన గ్రామ ప్రజల శీలాలను కాపాడే వ్య‌క్తి క్యాలీ ఫ్లవర్. అయితే..పెళ్లి తర్వాత తన శీలాన్నే పోగొట్టుకుంటాడు. తనకు జరిగిన అన్యాయంపై క్యాలీ ఫ్లవర్ చేసిన పోరాటమే ఈ చిత్రం. మొత్తానికి ట్రైల‌ర్ మొత్తం పుల్ కామెడీతో నింపేశారు. 'హృదయ కాలేయం' 'సింగం 123' 'కొబ్బరిమట్ట' వంటి చిత్రాలతో అలరించిన సంపూ.. 'క్యాలీఫ్లవర్' తో ఎలాంటి స‌క్సెస్‌ను అందుకుంటాడో చూడాలి మ‌రీ.

Next Story
Share it