ఆక‌ట్టుకుంటున్న 'స‌మ్మ‌త‌మే' టీజ‌ర్‌.. పెళ్ళికి ముందు ప్రేమనేది నాకు ప‌డ‌దండి

Sammathame Teaser out.యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2022 1:26 PM IST
ఆక‌ట్టుకుంటున్న స‌మ్మ‌త‌మే టీజ‌ర్‌.. పెళ్ళికి ముందు ప్రేమనేది నాకు ప‌డ‌దండి

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న చిత్రం 'సమ్మతమే'. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో కిర‌ణ్ స‌ర‌స‌న చాందిని చౌద‌రి న‌టిస్తోంది. యు.జి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కంక‌ణాల ప్ర‌వీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. జూన్ 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

నేడు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. 'ఐ ల‌వ్ యూ కృష్ణ' .. 'అయ్యో ఈ పెళ్ళికి ముందు ప్రేమనేది నాకు ప‌డ‌దండి, అందులో నేను ప‌డ‌ను' అనే డైలాగ్‌తో ఈ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. 'ల‌వ్ అంటే తెలీదా.. ఇక్క‌డేమ‌న్న ఎర్రి ఎద‌వ అని రాసుందారా' అంటూ స‌ద్దామ్ చెప్పే డైలాగ్స్ న‌వ్వులు పూయిస్తుంది. పెళ్లికి ముందు ప్రేమ‌లో ప‌డ‌ను అంటూనే ఓ యువ‌కుడు ప్రేమ‌లో ప‌డ‌గా.. ఆ యువ‌కుడు త‌న ప్రేమ‌ను గెలిపించుకున్నాడా..? వారి ప్రేమకు వచ్చిన ఇబ్బందులు ఏంటి..? అనేది కథగా తెలుస్తుంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్క‌తున్న ఈ చిత్రంలో చాందిని, కిర‌ణ్ ల మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. మొత్తంగా టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచేసింది.

Next Story