వాళ్లంద‌ర్ని చంపేస్తానంటున్న స‌మంత‌

Samantha says i will kill all of them.ఓటీటీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న వెబ్ సిరీస్‌ల్లో ఒక‌టి 'ది ఫ్యామిలీ మేన్-2'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 7:44 AM GMT
web series

ఓటీటీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న వెబ్ సిరీస్‌ల్లో ఒక‌టి 'ది ఫ్యామిలీ మేన్-2'. విశేష ఆద‌ర‌ణ పొందిన 'ది ఫ్యామిలి మేన్' కి స్వీకెల్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. మ‌నోజ్ భాజ్‌పాయ్, ప్రియ‌మ‌ణి, స‌మంత అక్కినేని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తొలిసారి స‌మంతం ఓ వెబ్ సిరీస్‌లో క‌నిపించ‌నుండ‌డం.. అందులోనూ ఓ ఉగ్ర‌వాది పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌డంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా ఈ సిరీస్‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

శ్రీకాంత్ జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్‌ సెల్‌లో పని చేసే ఓ మధ్యతరగతి వ్యక్తి. అతడు తన రహస్య ఉద్యోగం, అధిక ఒత్తిడి ప్రభావం కుటుంబం మీద పడకుండా జాగ్రత్త పడాలి. కానీ ఈ క్రమంలో అతడికి ఇంటా బయటా మొండిచేయి ఎదురవుతూ ఉంటుంది. ఆఫీసులో శ్రీకాంత్‌ ఏ పనీ చేయడని ఇంట్లోనేమో సరిగా మాట్లాడడు అని అతడిని నిందిస్తారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌ మీద వచ్చే సన్నివేశాలు వినోదభరితంగా ఉన్నాయి. అదే సమయంలో ఉగ్రవాదులను తుద ముట్టించే సీన్లలో శ్రీకాంత్‌ ఒక సైనిక వీరుడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు సమంత సూసైడ్‌ బాంబర్‌గా కనిపించింది. డీగ్లామర్‌ లుక్‌లో కనిపించిన సామ్‌.. వాళ్లంద‌ర్నీ నేను చంపేస్తా అంటూ చెప్పే డైలాగ్ హెలెట్‌గా నిలిచింది.

ఆమెను ఆరెస్ట్ చేయ‌డానికి శ్రీకాంత్ ఏవిధ‌మైన ప్ర‌య‌త్నాలు చేశాడు అనేది తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4 నుంచి ఈ కొత్త సిరీస్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


Next Story