అనుకున్నట్లే ఆ ఫోటోలు డిలీట్ చేసిన సమంత
Samantha Ruth Prabhu removes Chaitu pics.సమంత-నాగ చైతన్య విడిపోయారు. ప్రస్తుతం సమంత తీర్థయాత్రలకు వెళుతూ
By M.S.R Published on
28 Oct 2021 6:45 AM GMT

సమంత-నాగ చైతన్య విడిపోయారు. ప్రస్తుతం సమంత తీర్థయాత్రలకు వెళుతూ ఉంది. తన మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళుతోంది. ఇక రాబోయే రోజుల్లో సమంత వరుసగా సినిమాలలో నటించబోతోంది. తనను తాను చాలా బిజీగా ఉంచుకోవాలని సమంత భావిస్తోంది. ఇక విడాకుల ప్రకటన తర్వాత సామ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి చైతన్యతో కలిసి ఉన్న దాదాపు 80 చిత్రాలను తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, తన పెంపుడు జంతువులతో ఉన్న ఫొటోలను కాకుండా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను తీసేస్తోంది. ప్రస్తుతం సమంత దుబాయ్ పర్యటనలో ఉంది.
సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టారీతిన థంబ్‌నైల్స్ పట్టి వార్తలు ప్రసారం చేశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సమంత పలు ఛానల్స్‌తో పాటు డాక్టర్ సీఎల్ వెంకట్‌రావుపై కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కూకట్‌పల్లి కోర్టు సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్‌రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
Next Story