ట్రోల్స్‌పై స్పందించిన స‌మంత.. ఎద‌గండి అబ్బాయిలు అంటూ

Samantha ruth prabhu reacts on social media trolls.అక్కినేని నాగ చైత‌న్య‌, న‌టి స‌మంత కొద్ది నెల‌ల క్రితం విడిపోయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 1:06 PM IST
ట్రోల్స్‌పై స్పందించిన స‌మంత.. ఎద‌గండి అబ్బాయిలు అంటూ

అక్కినేని నాగ చైత‌న్య‌, న‌టి స‌మంత కొద్ది నెల‌ల క్రితం విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల అనంత‌రం ఎవ‌రి కెరియ‌ర్‌పై వారు పూర్తిగా దృష్టి పెట్టి ప‌ని చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ బిజీగా ఉన్నారు. అయితే.. కొద్ది రోజులుగా నాగ చైత‌న్య‌, ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, ఆమెతో చై ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాగా.. దీనిపై చై అభిమానులు మండిప‌డుతున్నారు. చై ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడానికే సమంత పీర్‌ఆర్‌ టీమ్‌ ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తోంది సోష‌ల్ మీడియాలో స‌మంత‌ను ట్రోల్ చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌రుగుతున్న ట్రోల్స్‌పై స‌మంత స్పందించింది. 'అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయిస్తోందంటారు. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మీరు ప్రస్తావించిన వ్యక్తులు ముందుకెళ్లిపోతున్నారు. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పని మీద, మీ కుటుంబాల విషయాల మీద ఏకాగ్రత పెట్టండి'అని సమంత ట్వీట్ చేసింది.

సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య నటించిన 'థ్యాంక్యూ', లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే స‌మంత ప్రధాన పాత్రల్లో నటించిన యశోదా, శాకుంతలం చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

Next Story