మరో అవార్డ్ అందుకున్న సమంత.. థ్యాంక్స్ అంటూ ట్వీట్‌

Samantha Ruth Prabhu bag Filmfare OTT Awards 2021.హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2021 11:20 AM IST
మరో అవార్డ్ అందుకున్న సమంత.. థ్యాంక్స్ అంటూ ట్వీట్‌

హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందం, అభిన‌యంతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. విడాకుల అనంత‌రం త‌న కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించింది. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు. సినిమాల‌తో పాటు ఓటీటీల్లోనూ న‌టిస్తూ అద‌ర‌గొడుతోంది. భిన్న‌మైన పాత్ర‌లు చేస్తూ.. త‌న‌ని త‌ప్ప వేరే వారు ఎవ‌రిని ఆ పాత్ర‌లో ఊహించుకోలేనంత‌గా న‌టిస్తూ అభిమానుల‌ను మెప్పిస్తోంది. ఎన్నో వివాదాల త‌రువాత వ‌చ్చిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సామ్‌.. రాజీ పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. త‌న కెరీర్‌లో ఎప్పడూ చేయ‌ని ఓ ఇంట్రెన్స్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి విమ‌ర్శ‌ల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంది.

కాగా.. 'ఫ్యామిలీ మ్యాన్ 2'కు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డు అందుకుంది స‌మంత‌. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తూ థ్యాంకు అంటూ రీ ట్వీట్ చేసింది సామ్‌. 'ఏమాయ చేసావే', 'ఈగ', 'నీతానే ఎన్ వసంతం'' చిత్రాలకు ఉత్తమ నటిగా స‌మంత అవార్డులు అందుకోగా.. న‌టించిన తొలి ఓటీటీ వెబ్‌సిరీస్‌కు సైతం ఉత్త‌మ న‌టిగా అవార్డు గెలుచుకుంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే సామ్‌.. ప్ర‌స్తుతం అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుటుంది.

Next Story