'హనుమాన్' మూవీపై సమంత రివ్యూ

సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమాలను తలదన్నేలా హనుమాన్‌ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  19 Jan 2024 5:45 PM IST
samantha, review,  hanuman movie, tollywood,

'హనుమాన్' మూవీపై సమంత రివ్యూ 

సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమాలను తలదన్నేలా హనుమాన్‌ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అలాగే భారీ వసూళ్లను కూడా రాబడుతోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన హనుమాన్‌ పేరే వినబడుతోంది. తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ సినిమా తీశాడంటూ ప్రేక్షకులు కూడా పొగిడే్తున్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్‌ గురించి తాజాగా హీరోయిన్‌ సమంత కూడా రివ్యూ ఇచ్చారు. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.

మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లగలిగే సినిమాలో ఎంతో ఉత్తమమైవని అని చెప్పారు సమంత. హనుమాన్‌లో అద్బుతమైన విజువల్స్‌, మంచి కామెడీతో పాటు మ్యూజిక్‌, అద్భుతమైన విజువల్స్‌ ఉన్నాయని చెప్పారు. థాంక్యూ ప్రశాంత్‌ అంటూ డైరెక్టర్‌కు చెప్పారు. నీయూనివర్స్‌ నుంచి రాబోయే తదుపరి సినిమా కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు సామ్‌ అన్నారు. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నటించిన తేజ సజ్జ నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పింది సామ్. హనుమంతుడి పాత్ర అయితే.. మూవీకి హార్ట్‌ అని చెప్పింది. ఇందులో నటించి మంచి హిట్‌ అందుకున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత శుభాకాంక్షలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

ఇక హనుమాన్‌ సినిమా విషయానికి వస్తే.. అంజనాద్రి అనే ఊహ ప్రాంతం ఉంటుంది. అందులో హనుమంతు (తేజ సజ్జా) ఒక మామూలు కుర్రాడు. దొంగతనాలు చేస్తూ సరదాగా ఉంటాడు. అనుకోని సంఘటనతో అతనికి అతీత శక్తులు వస్తాయి. ఊర్లో సూపర్‌ హీరోగా మారతాడు. అయితే.. ఆ శక్తుల గురించి తెలుసకున్న మైఖెల్ (వినయ్‌రాయ్‌) అంజనాద్రికి వస్తాడు. హనుమంతు వద్ద శక్తులు లాక్కోవాలని.. తాను సూపర్‌ హీరో అవ్వాలనుకుంటాడు. మైఖెల్‌ వల్ల అంజనాద్రికి ఎలాంటి ముప్పు వచ్చింది? హనుమంతు ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ.


Next Story