సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడంపై స్పందించిన సమంత

Samantha reaction on name change in social media.సమంత అక్కినేని.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sept 2021 5:00 PM IST
సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడంపై స్పందించిన సమంత

సమంత అక్కినేని.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమె గురించి చర్చ జరిగింది. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో పేరును మార్చేసుకోవడం..! ఒకప్పుడు సమంత అక్కినేని అని ఉన్న పేరును కాస్తా ఆమె కేవలం 'ఎస్' అని ఉంచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో ఓ స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారనే చర్చ జరగడంతో.. సమంత-నాగ చైతన్య విడిపోతున్నారనే ప్రచారం భారీగా సాగింది. ఆమె సోషల్ మీడియాలో పేరు మార్చుకోగా, చైతు, నాగ్ లతో విబేధాలే కారణం అంటూ ప్రచారం సాగుతోంది. నాగ్ బర్త్ డే వేడుకలలో సమంత లేకపోవడం, ఈ అనుమానాలు మరింత పెంచేశాయి. అయితే ఆమె నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రం తెలిపింది.

ఆమె సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడంపై తీవ్ర చర్చ జరిగింది. తాజాగా తాను సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడంపై సమంత స్పందిస్తూ "సమంత సామాజిక మాధ్యమాల్లో పేరెందుకు మార్చుకుంది? ఈ విషయం హాట్‌ టాపిక్‌ అయింది. ట్రోల్స్‌ వస్తున్నాయి. దానిపై స్పందించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పుడే కాదు ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2 విడుదలైన సమయంలోనూ విమర్శలు ఎదురయ్యాయి. దీని గురించి ఏదైనా చెప్పండి అంటూ కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా కోరారు. ఇందుకు సుమారు 65,000 ట్వీట్లు పెట్టారు. కానీ, నాకు జవాబు ఇవ్వాలనిపించలేదు. సంబంధిత విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా" అని సూటిగా తెలిపింది.

Next Story