'పుష్ప' మూవీలో స‌మంత.. పిక్ వైర‌ల్‌

Samantha pic in Pushpa movie goes viral.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2021 9:55 AM IST
పుష్ప మూవీలో స‌మంత.. పిక్ వైర‌ల్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుత‌న్న ఈచిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందన్నా న‌టిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ సమంత ఓ స్పెష‌ల్ సాంగ్‌లో ఆడి పాడ‌నుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా తెలియ‌జేస్తూ ఓ కొత్త పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. లంగా, జాకెట్ ధ‌రించి పుల్ మాస్ లుక్‌లో ఉన్న స‌మంత బ్యాడ్ సైడ్ మాత్ర‌మే ఆ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రెండు భాగాలుగా పుష్ప చిత్రం తెర‌కెక్కుతోంది. తొలి భాగం 'పుష్ప : ది రైజ్' క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 17 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శేషాచ‌లం కొండ‌ల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాసిల్‌, సునీల్‌, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story