అభిమానుల ట్రోలింగ్.. ఫోటో డిలీట్ చేసిన సమంత..!
Samantha deleted instagram post.అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2021 11:37 AM ISTఅక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ఫోటోలు, సినిమా సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అయితే.. తాజాగా ఆమె పెట్టిన ఓ ఫోటో ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు రావడంతో.. కొద్ది సేపటికే ఆ ఫోటోను డిలీట్ చేసేసింది. అయితే.. అప్పటికే ఆ ఫోటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది.
'ది ఫ్యామిలీ మెన్ 2' అనే వెబ్ సిరీస్‌లో విలన్‌గా నటించింది సమంత. దీని ప్రమోషన్ కోసం ముంబై వెళ్ళింది. అక్కడ తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి సోఫాలో పడుకున్న ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాలుగేళ్ల బంధం మాది అని పేర్కొంది. దీనికి ప్రీతమ్ ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోను చూసిన అక్కినేని అభిమానులు షాక్ తిన్నారు. నెగిటివ్‌గా రియాక్డు అయ్యారు. ఎంత చనువు ఉంటే మాత్రం అలా ఆయన మీద కాళ్ళు పెట్టి ఫొటో దిగడం ఏంటి? ఆయన దీనికి ఐ లవ్ యూ అని రిప్లై ఇవ్వడమేంటని తెగ ట్రోల్ చేశారు.
వెంటనే సమంత ఈ పోస్టును డిలీట్ చేసింది. ఆ వెంటనే ప్రీతమ్ కూడా తన స్టోరీలో నుంచి తీసేశారు. కానీ.. అప్పటికే ఈ పోటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో తాలుకు పరిణామాలు సమంతను ఎంత కాలం వెంటాడుతాయో అన్న మాటలు వినిపిస్తున్నాయి. గుణశేఖర్ తెరకెక్కించనున్న శాకుంతలం చిత్రంలో సమంత నటించనుంది.