భ‌క్తి పార‌వ‌శ్యంలో స‌మంత‌

Samantha completes Chardham YatraSamantha completes Chardham Yatra.అక్కినేని నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన‌ త‌రువాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2021 8:37 AM GMT
భ‌క్తి పార‌వ‌శ్యంలో స‌మంత‌

అక్కినేని నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన‌ త‌రువాత స‌మంత బాగా కుంగిపోయింద‌ని ఆమె స‌న్నిహితులు తెలిపారు. ఇదిలా ఉంటే..ప్ర‌స్తుతం స‌మంత న‌టిస్తున్న సినిమాల‌కు కాస్త విరామం ల‌భించ‌డంతో త‌న స్నేహితురాలైన‌ శిల్పారెడ్డితో క‌లిసి చార్‌ధామ్ యాత్ర‌కు వెళ్లారు. తాజాగా ఆ యాత్ర ముగిసింది. య‌మునోత్రి నుంచి గంగోత్రి మీదుగా కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ వ‌ర‌కు స‌మంత తీర్థ‌యాత్ర సాగింది. చార్ ధామ్‌లో స‌మంత ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం గంగా హారతిలో పాలుపంచుకున్నారు. రిషీకేశ్ లోని మహర్షి మహేశ్ యోగి ఆశ్రమాన్ని సందర్శించినట్టు పేర్కొంది. ఈ యాత్ర‌లోని ఎన్నో విశేషాల‌ను స‌మంత ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గదామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాన‌ని.. ఇది దేవుళ్లకు నిలయమైన ప్రదేశమ‌ని.. ఇందులో ఎన్నో రహస్యలు, అద్భుతాలు దాగి ఉన్నాయన్నారు. హిమాలయాలను సందర్శించాలనే త‌న‌ కల ఇప్ప‌టికి నెర‌వేరిన‌ట్లు చెప్పారు. 'దేవుడి మీద నమ్మకం, ప్రస్తుతం ఉండే వాస్తవికత మధ్య ఎప్పుడూ సంక్లిష్టమైన గందరగోళం ఉంటుంది. అదెప్పుడూ ఉత్కంఠభరితమైనదే నా హృదయంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శిల్పా రెడ్డితో ఈ ప్రయాణం సాగించడం వల్ల మరింత ప్రత్యేకమైందిగా మారింది' అని స‌మంత రాసుకొచ్చింది.

Next Story
Share it