కరణ్ జొహార్ షోలో సమంత సంచ‌ల‌న వ్యాఖ్యలు.. భ‌ర్త కాదు మాజీ భ‌ర్త అనండి

Samantha Clarifies Naga Chaitanya Is Her 'Ex Husband.అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకోవ‌డం ఇప్ప‌టికీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 10:47 AM IST
కరణ్ జొహార్ షోలో సమంత సంచ‌ల‌న వ్యాఖ్యలు.. భ‌ర్త కాదు మాజీ భ‌ర్త అనండి

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకోవ‌డం ఇప్ప‌టికీ హాట్ టాఫిక్‌గానే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అయితే.. వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఇక విడాకుల‌పై స‌మంత తొలి సారి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో పాల్గొన్న స‌మంత ప‌లు షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఇద్ద‌రిని ఓ గ‌దిలో ఉంచిన‌ప్పుడు అక్క‌డ ప‌దునైన ఆయుధాలు లేకుండా చూడాల‌న్నారు.

బాలీవుడ్‌ పాపులర్‌ షో కాఫీ విత్‌ కరణ్‌లో సమంత, హీరో అక్షయ్‌ కుమార్‌తో కలిసి సందడి చేసింది. నీ భ‌ర్త నుంచి విడిపోయిన‌ప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు అని క‌ర‌ణ్ ప్ర‌శ్నించ‌గా.. 'భ‌ర్త కాదు మాజీ భ‌ర్త అని' స‌మంత అంది. దీనికి క‌ర‌ణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పి ఇంట‌ర్వ్యూ కొన‌సాగించారు.

'మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. విడాకులు తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో బాధపడ్డాను. ప్ర‌స్తుతం బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డా. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం లేదు. ఒక వేళ మా ఇద్ద‌ర్నీ ఒకే గ‌దిలో ఉంచితే అక్క‌డ ఎలాంటి ప‌దునైన ఆయుధాలు, వ‌స్తువులు లేకుండా చూసుకోవాలి. భ‌విష్య‌త్తులో మా మ‌ధ్య స‌ఖ్య‌త వ‌స్తుందేమో తెలీదు. ఇక మేం విడిపోయిన‌ప్పుడు నా పై నెగెటివ్ ప్ర‌చారం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో వాటిపై స్పందించేందుకు నా ద‌గ్గ‌ర స‌మాధానాలు లేవు. నేను ఓపెన్‌గా ఉండాల‌ని అనుకుంటున్నా. అందుకే విడిపోయిన విష‌యాన్ని అంద‌రితో చెప్పా 'అని స‌మంత తెలిపింది.

అలాగే రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. 'నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశా' అంటూ సరదాగా చెప్పుకొచ్చింది సామ్‌.

Next Story