'అక్కినేని' పేరుని తొలగించిన సమంత..!
Samantha changes display name from Samantha Akkineni to S.'ఏమాయ చేసావే'చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది
By తోట వంశీ కుమార్ Published on 31 July 2021 9:27 AM IST'ఏమాయ చేసావే' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తరువాత వరుసగా టాప్ హీరోలతో నటిస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన తొలి చిత్రం హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలిగా మారింది. ఇక వివాహం అనంతరం తన సోషల్ మీడియా మాధ్యమాలలో తన పేరును 'సమంత అక్కినేని'గా మార్చేసింది. పెళ్లికి ముందు వరకు గ్లామరస్ రోల్‌లో కనిపించినా.. పెళ్లి తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న ప్రాతల్లో నటిస్తుంది.
తనకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇప్పుడు సడన్ గా సామ్.. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో 'అక్కినేని' పేరు తీసివేయడం చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ప్రొపైల్‌లో ఇన్నాళ్లూ.. 'సమంత అక్కినేని' అని ఉండేది. అయితే నిన్న సడెన్‌గా ఆ పేరు స్థానంలో 'S' అనే సింగిల్ లెటర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది అందరిలో అనేక సందేహాలను రేకెత్తించేలా చేసింది. సమంత ఇలా ఎందుకు చేసిందా అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్నారు. సామ్ ఏదైనా ప్రచార ప్రచారంలో భాగంగా ఇలా చేసిందా? క్యాజువల్ గా ఎడిట్ చేసిందా? అని ఆలోచిస్తున్నారు. మరి సమంత సోషల్ మీడియాలో డిస్ప్లే నేమ్ మార్చడానికి గల కారణాన్ని సమంత వెల్లడిస్తేనే కానీ అసలు కారణం తెలియదు. అయితే..పేస్‌బుక్ లో మాత్రం పేరును మార్చలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు తమిళ్ లో నయనతార తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.