ప్రేక్ష‌కుల మదిని మాయ చేసిన‌ సమంత.. బర్త్ డే సీడీపీ విడుదల

Samantha Birth day special story.నేడు (ఏప్రిల్ 28) స‌మంత పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా స్టార్ హీరోయిన్ తమన్నా.. సామ్‌ బర్త్ డే సీడీపీ రిలీజ్ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2021 3:22 AM GMT
Samantha

'ఏ మాయ చేశావే' చిత్రంతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది ముద్దుగుమ్మ స‌మంత. అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను మాయ చేసి వారి మ‌దిని దోచేసింది. అన‌లికాలంలో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌ల‌లో ఒకరిగా నిలిచింది. తొలి సినిమాలో న‌టించిన హీరో నాగ చైత‌న్య నే ప్రేమించి పెళ్లాడి.. అక్కినేని వారి కోడ‌లు అయ్యింది. వివాహాం జ‌రిగిన త‌రువాత కూడా స‌మంత హీరోయిన్‌గా త‌న హ‌వా చాటుటోంది. అంతేకాదు మంచి మ‌న‌సున్న అమ్మాయిగా కూడా ప‌లువురి చేత భేష్ అనిపించుకుంటోంది. 'ప్ర‌త్యూష స‌పోర్ట్ ' అనే స్వ‌చ్చంద సేవా సంస్థ‌ను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల‌కు విద్య‌, వైద్యం అందిస్తూ త‌న గొప్ప మ‌న‌సును చాటుకుంటోంది స‌మంత‌.

కాగా.. నేడు (ఏప్రిల్ 28) స‌మంత పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా స్టార్ హీరోయిన్ తమన్నా.. సామ్‌ బర్త్ డే సీడీపీ రిలీజ్ చేసింది. సౌత్ క్వీన్ అంటూ అదే అర్ధం వచ్చేలా సీడీపీని క్రియేట్ చేశారు. అలాగే సౌత్ రాజ్యానికి సామ్ ను క్వీన్ లా చూపిస్తూనే సీడీపీలో ఆమె నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలు(pratyusha ekam) మెన్షన్ చేశారు. అదే విధంగా కరోనా సమయంలో మాస్క్ ధరించి ఆరోగ్యంగా ఉండాలంటూ ట్యాగ్స్ తో అవగాహన కల్పించేలా ప్రయత్నం చేయడం మెచ్చుకోవాలి. ప్రస్తుతం సమంత సీడీపీ సోషల్ మీడియాలో సినీవర్గాలలో హల్చల్ చేస్తోంది. అలాగే సామ్ ఇప్పుడు కాతువకుల రెండు కాదల్ శకుంతలం సినిమాలు చేస్తోంది.
Next Story