సమంత రెమ్యునరేషన్‌లో సెకండ్ టాప్.. సినిమాకు ఎంత తీసుకుంటోందంటే

Samantha becomes 2nd highest paid actress after Nayanthara. సౌత్ ఇండియా క్వీన్ గా కీర్తించబడుతున్న సమంత అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా రెండో స్థానంలో నిలిచింది.

By M.S.R  Published on  11 March 2022 11:49 AM IST
సమంత రెమ్యునరేషన్‌లో సెకండ్ టాప్.. సినిమాకు ఎంత తీసుకుంటోందంటే

సౌత్ ఇండియా క్వీన్ గా కీర్తించబడుతున్న సమంత అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా రెండో స్థానంలో నిలిచింది. గత 12 సంవత్సరాలలో సమంత కెరీర్ అద్భుతంగా సాగింది. ఎంతోమంది ఔత్సాహిక నటీమణులకు స్ఫూర్తిని ఇస్తుంది ఆమె జర్నీ. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి నయనతార కాగా, రెండో స్థానంలో సమంత నిలిచింది. గత రెండేళ్లలో వరుస విజయాల తర్వాత సామ్ తన రెమ్యునరేషన్‌ను పెంచిందని కథనాలు వచ్చాయి. సమంత చివరిసారిగా అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' చిత్రంలో కనిపించింది. సుకుమార్ సినిమాలోని ఫేమస్ పాట "ఊ అంటావా" కు సమంత సరికొత్త అందాన్ని తీసుకుని వచ్చింది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె రెండో స్థానంలో నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అనేక నివేదికల ప్రకారం.. సమంత తన చిత్రాలకు రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ప్రొడక్షన్ హౌస్, చాలా ఇతర అంశాలను బట్టి, నటి తన రెమ్యునరేషన్‌ను తదనుగుణంగా కోట్ చేస్తుంది. పుష్ప: ది రైజ్‌లో తన స్పెషల్ సాంగ్ కోసం సమంత రూ. 5 కోట్లు వసూలు చేసిందనే రూమర్ కూడా ఉంది. గత రెండేళ్లుగా సమంత ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. కమర్షియల్ చిత్రాలలో భాగం కావడం నుండి మహిళా-కేంద్రీకృత సినిమాల వరకు సమంత చేసుకుంటూ వెళుతోంది. సమంత తన రాబోయే చిత్రం కాతువాకుల రెండు కాదల్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కథువాకుల రెండు కాదల్ ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. శాకుంతలం సినిమాలోనూ, ఒక హాలీవుడ్ సినిమాలోనూ ఆమె నటిస్తూ ఉంది.

Next Story