హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న సమంత.. బోల్డ్ పాత్రలో
Samantha Announces Her First Global Film.హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత
By తోట వంశీ కుమార్ Published on 26 Nov 2021 12:05 PM ISTహీరో అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌పై పుల్ ఫోకస్ పెట్టింది. వరుసగా వెబ్‌సిరీస్‌లు, చిత్రాలను ఒప్పుకుంటూ తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిజీగా ఉంటోంది. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని శుక్రవారం సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు ఫిలిఫ్ జాన్ తెరకెక్కించనున్న ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ 'అరెంజ్‌మెంట్స్ ఆప్ లవ్' చిత్రంలో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో 27 ఏళ్ల బైసెక్సువల్ అమ్మాయిగా సామ్ కనిపించనుంది. 'ఓ బేబీ' చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి ఈ చిత్రానికి నిర్మాత. 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ సినిమాలో నటించేందుకు చాలా ఉత్సాహంతో ఆసక్తిగా ఉన్నట్లు గా సమంత చెప్పుకొచ్చింది. పూర్తిగా కొత్త ప్రపంచం. ఆరెంజ్‌మెట్స్ ఆఫ్ లవ్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు చెప్పింది. అను పాత్ర పాత్ర కోసం తనను ఎంచుకున్నందుకు దర్శకుడు ఫిలిఫ్ జాన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ ప్రయాణాన్ని ప్రారంబించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. పిలిప్ జాన్ తో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. '2009లో విడుదలైన 'ఏ మాయ చేసావే' సినిమా తరువాత ఈ చిత్రం కోసమే అడిషన్స్‌లో పాల్గొన్నా. సుమారు 12 ఏళ్ల తరువాత అడిషన్స్‌లో పాల్గొనడం ఎంతో కంగారుగా అనిపించిందని' అని సమంత రాసుకొచ్చింది.