విడాకుల ప్ర‌క‌ట‌న‌.. ట్విట‌ర్ ప్రొఫైల్ పేరు మార్చేసిన స‌మంత‌..!

Samanta changes her twitter profie name.ఏ మాయ చేశావే చిత్రంతో మాయ చేసిన సమంత రూత్ ప్ర‌భు అక్కినేని వార‌సుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Oct 2021 8:20 AM GMT
విడాకుల ప్ర‌క‌ట‌న‌.. ట్విట‌ర్ ప్రొఫైల్ పేరు మార్చేసిన స‌మంత‌..!

'ఏ మాయ చేశావే' చిత్రంతో మాయ చేసిన సమంత రూత్ ప్ర‌భు అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య‌ని పెళ్లి చేసుకుని స‌మంత అక్కినేనిగా మారింది. త‌న సోష‌ల్‌మీడియా ఫ్లాట్‌ఫాం అన్నింటిలోనూ స‌మంత అక్కినేనిగా పెట్టుకుంది. అయితే.. అక్కినేని అన్న ప‌దాన్ని స‌మంత తొల‌గించి చాలా కాలమే అయ్యింది. త‌న పేరును 'ఎస్' గా పెట్టుకుంది. అప్ప‌టి నుంచే చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డంపై చ‌ర్చ ప్రారంభ‌మైంది. తాజాగా శ‌నివారం వారిద్ద‌రూ అధికారికంగా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే.


విడాకులు ప్ర‌క‌ట‌న చేసిన అనంత‌రం సమంత మ‌రో అడుగు ముందుకు వేసింది. ఇంత‌కాలంగా ఉన్న ఎస్ అక్ష‌రాన్ని తొల‌గించి స‌మంత‌గా మార్చేసుకుంది. దీనిని బ‌ట్టి చూస్తుంటే ఇంత‌కాలం అధికారిక ప్ర‌క‌ట‌న కోస‌మే త‌న ప్రొపైల్ పేరునుమార్చ‌కుండా ఆగిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఫేస్‌బుక్‌లో మాత్రం ఇంకా సమంత అక్కినేనిగానే కొనసాగుతోంది. కావాల‌నే ఉంచిందా లేక మ‌రిచిపోయిందా అనే దానిపై అభిమానులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story