శ్రీ విష్ణుకు వింత స‌మ‌స్య‌

యంగ్ హీరో శ్రీ విష్ణు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న సామజవరగమన చిత్ర‌ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 7:22 AM
శ్రీ విష్ణుకు వింత స‌మ‌స్య‌

కంటెంట్ ఉన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న న‌టుడు శ్రీ విష్ణు. సినిమా ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం "సామజవరగమన". రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా రెబా మోనికా జాన్‌ క‌థానాయిక‌.

నేడు శ్రీ విష్ణు పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. 33 సెకండ్ల ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. 'ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్లకి కాస్ట్‌ ప్రాబ్లెమ్‌ వస్తుంది లేదా క్యాష్‌ ప్రాబ్లమ్‌ వస్తుంది. కానీ నాకేంట్రా ఎవరకీ రాని వింత ప్రాబ్లమ్‌ వచ్చింది.' అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. మ‌రీ శ్రీ విష్ణుకు వ‌చ్చిన ఆ వింత స‌మ‌స్య ఏమిటో అన్నది మాత్రం రివీల్ చేయ‌లేదు.

గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story