సల్మాన్ ఖాన్ గల్వాన్ సినిమా టైటిల్ మార్పు..కల్నల్ సంతోష్ బాబు పాత్రలో భాయ్‌జాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ప్రతిష్టాత్మక చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరును 'మాతృభూమి'గా మారుస్తున్నట్లు ప్రకటించారు.

By -  Knakam Karthik
Published on : 16 March 2026 5:00 PM IST

Cinema News, Bollywood News, SalmanKhan, Maatrubhumi, GalwanValley, ColonelSantoshBabu

సల్మాన్ ఖాన్ గల్వాన్ సినిమా టైటిల్ మార్పు..కల్నల్ సంతోష్ బాబు పాత్రలో భాయ్‌జాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ప్రతిష్టాత్మక చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరును 'మాతృభూమి'గా మారుస్తున్నట్లు ప్రకటించారు. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' ఫేమ్ అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, అరిజిత్ సింగ్ పాడిన 'మాతృభూమి' అనే ట్రాక్ నుండి స్ఫూర్తి పొంది ఈ కొత్త పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు "మే వార్ రెస్ట్ ఇన్ పీస్" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను జోడించారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో కనిపిస్తారు. గతంలో సల్మాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌పై చైనా ప్రభుత్వ పత్రిక 'గ్లోబల్ టైమ్స్' విమర్శలు గుప్పించింది. ఇది వాస్తవాలను వక్రీకరించే సినిమా అని ఆరోపించగా, భారత ప్రభుత్వ వర్గాలు మాత్రం సినిమా అనేది ఒక కళాత్మక వ్యక్తీకరణ అని, గతంలోనూ 'హకీకత్' వంటి చిత్రాలు వచ్చాయని గట్టిగా బదులిచ్చాయి. సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్ల వీరమరణాన్ని, దేశభక్తిని చాటిచెప్పేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Next Story