సల్మాన్ ఖాన్ రాధే ట్రైలర్.. సీటీ మార్ సాంగ్ ను వాడేశారుగా..!

Salman Khan Radhe Trailer Out.సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'రాధే.. ది మోస్ట్ వాంటెడ్ భాయ్'..! ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 6:27 AM GMT
Radhe trailer

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'రాధే.. ది మోస్ట్ వాంటెడ్ భాయ్'..! ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది. సల్మాన్ ఖాన్ గత సినిమాలన్నింటినీ కలిపి తీసిన సినిమాలా ట్రైలర్ ఉంది. ఈ సినిమాలో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలోని సీటీ మార్ సాంగ్ ను వాడేశారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో డ్రగ్స్ మాఫియాను అడ్డుకునే పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. అతడి ప్రియురాలిగా దిశా పటానీ నటిస్తోంది. కొంచెం కూడా కొత్తదనం అయితే ట్రైలర్ లో కనిపించలేదు. సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా ఘోరంగా ఉన్నాయి. ఇక సినిమా ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే మే 13 వరకూ ఎదురుచూడాల్సిందే..! ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.

సినిమాను థియేటర్లలోనూ, ఓటీటీలలోనూ ఒకేసారి విడుదల చేయాలని భావిస్తోంది. మే13న సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమా అటు సినిమా థియేటర్ల లోనూ, ఇటు జీ ప్లెక్స్ లో చూడొచ్చు. పే పర్ వ్యూ ద్వారా సినిమాను ఇంట్లో కూర్చునే టీవీలో ఎంజాయ్ చేయొచ్చు. జీ ప్లెక్స్ ను పలు డీటీహెచ్ సంస్థలు అందిస్తూ ఉన్నాయి.జాకీ ష్రాఫ్, రణదీప్ హుడాలు కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు.


Next Story