నన్ను పాము మూడుసార్లు కరిచింది : సల్మాన్ ఖాన్
Salman Khan opens up about snake bite.బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు(సోమవారం)
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2021 12:05 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు(సోమవారం) 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నమహారాష్ట్రలోని పాన్వేల్ ఫామ్‌హౌస్‌లో ఉండగా సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా సల్మాన్ మాట్లాడారు. పాన్వేల్‌లోని తన ఫాంహౌస్ చుట్టూ అటవీ ప్రాంతమే ఉంటుందని చెప్పాడు. దీంతో అక్కడ తరచూ పాములు తిరుగుతుంటాయన్నాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులు, స్నేహితులు శనివారం రాత్రి ఫాంహౌస్‌కు వచ్చినట్లు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున ఓ గదిలో పాము కనిపించడంతో అక్కడ ఉన్న వారందరూ పాము పాము అని కేకలు వేసినట్లు చెప్పాడు. దాన్ని పట్టుకుని అడవిలో వదిలేద్దామని తీసుకువస్తుండగా.. తన చేతిపై మూడు సార్లు కరిచిందన్నాడు. వెంటనే వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు తనను ఆస్పత్రికి తరలించారని, ఆరు గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. అనంతరం తనను డిశ్చార్జ్ చేశారన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే.. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆపాము మళ్లీ కనిపించిందన్నారు. ఈ సారి దాంతో ఓ ఫోటో కూడా దిగినట్లు సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఆ పామును కూడా తన ఫ్రెండ్‌గానే బావిస్తున్నట్లు సల్మాన్ చెప్పాడు.
ఇక తాను రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం 'టైగర్-3', 'కబీ ఈద్ కబీ దివాళీ' షూటింగ్స్‌తో బిజీ ఉన్నట్లు తెలిపారు. అవి పూర్తి అయిన వెంటనే 'భజరంగీ భాయిజాన్' స్వీకెల్ ను పట్టాలెక్కించుకున్నట్లు చెప్పాడు. ఆ చిత్రానికి 'పవన్‌పుత్ర భాయిజాన్' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారన్నారు. 'నో ఎంట్రీ సీక్వెల్' కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.