బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ అనారోగ్యానికి గురైయ్యాడు. గత కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పరీక్షలు చేయించుకోగా డెంగ్యూగా నిర్థారణ అయింది. డాక్టర్లు ఆయన్ను రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సల్మాన్ నటిస్తున్న షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆయన 'కిసీ కా భాయ్, కిసీ కా జాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 16 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
డెంగ్యూ సోకడంతో ఆయన బిగ్‌బాస్ సీజన్ 16లో పలు ఎపిసోడ్‌లలో కనిపించరు. ఆయన స్థానంలో నిర్మాత కరుణ్ జోహార్ హోస్ట్ గా కనిపించనున్నారు. కాగా.. గత సంవత్సరం బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ షో కు కరణ్ జోహార్ హోస్ట్ గా చేశారు. దీనిని అప్పుడు Voot లో ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్ మొత్తం కరణ్ జోహారే కొనసాగారు. ఇప్పుడు మొదటిసారిగా టీవీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఏదైన కష్టం వస్తే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు. కరణ్ ప్రస్తుతం సినిమాలు, 'కాపీ విత్ కరణ్' అనే ప్రొగ్రాంతో బిజీగా ఉన్నారు. అయినా సల్మాన్ కోసం వాటిని పక్కనపెట్టేసి బిగ్ బాస్ హౌస్ కు హోస్ట్ గా రానున్నారు.