ప్రస్తుతం ‘బిగ్ బాస్ 18’ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ దుబాయ్ లో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా సల్మాన్ ఖాన్ తాను ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా స్టేజ్ షోలో ప్రదర్శన చేయబోతున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ద-బ్యాంగ్ టూర్ కు సంబంధించిన పోస్టర్‌ను పంచుకున్నాడు.
ఈ టూర్ లో సల్మాన్‌తో పాటు సోనాక్షి సిన్హా, దిశా పటానీ, మనీష్ పాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సునీల్ గ్రోవర్, దర్శకుడు-కొరియోగ్రాఫర్ ప్రభుదేవా వంటి ఇతర నటీనటులు కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తన రాజకీయ మిత్రుడు బాబా సిద్ధిక్‌ను హత్య చేసిన తర్వాత సల్మాన్ లో ప్రొఫైల్‌ను కొనసాగిస్తున్నాడు. తన బహిరంగ ప్రదర్శనలను పరిమితం చేశాడు. దుబాయ్ ప్రపంచంలోని సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినందున సల్మాన్ దుబాయ్ పర్యటన నటుడికి కొంత విశ్రాంతిని ఇస్తుందని భావిస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌కు అనేకసార్లు బెదిరింపులను పంపింది. కెనడాలో కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కు ఇటీవలి పరిణామాల కారణంగా సెక్యూరిటీని భారీగా పెంచేశారు.