సలార్ వీడియో లీక్‌.. ప్ర‌భాస్ లుక్ అదుర్స్‌..!

Salaar movie set goes viral.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2021 10:42 AM IST
సలార్ వీడియో లీక్‌.. ప్ర‌భాస్ లుక్ అదుర్స్‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'స‌లార్‌'. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌గా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటోంది. భారీ యాక్ష‌న్ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. కాగా.. ఈ సినిమాకి లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు.

తాజాగా సలార్ షూటింగ్ స్పాట్‌ లో ప్రభాస్ కి సంబంధించిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో లీకైంది. ఇది సినిమాలో సన్నివేశానికి సంబంధించిన‌ది కాదు కానీ.. స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్ గెట‌ప్‌ను రివీల్ చేస్తోంది. ఇందులో ప్ర‌భాస్ ప‌వ‌ర్ పుల్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్‌ను చూసిన ప్ర‌భాస్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. అయితే ఈ వీడియో లేటెస్ట్ వీడియోనా? కాదా అనేది క్లారిటీ లేదు.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదలకానుంది. దాదాపు 150-200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంతో పాటు ఆదిపురుష్ 3డీ, నాగ్ అశ్విన్ తో సైన్స్‌ఫిక్ష‌న్ చిత్రంలోనూ ప్ర‌భాస్ న‌టిస్తున్నారు.

Next Story