ప్ర‌భాస్ 'సలార్‌' యాక్షన్‌ సీన్‌ వీడియో లీక్‌..!

Salaar Movie action scene leaked.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాలను చేస్తూ పుల్ బిజీగా ఉన్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2021 5:28 PM IST
ప్ర‌భాస్ సలార్‌ యాక్షన్‌ సీన్‌ వీడియో లీక్‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాలను చేస్తూ పుల్ బిజీగా ఉన్నాడు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌లార్' చిత్రంలో ఆయ‌న న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అయితే.. ఈ చిత్రానికి లీక్‌ల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ గెట‌ప్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ కాగా.. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యాక్ష‌న్ స‌న్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో అది.

ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్ ప‌ట్టుకుని కాలుస్తున్నాడు. వీడియో నిడిచి చాలా త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి.. ప్ర‌భాస్ ఈ చిత్రంలో ఎలా ఉండ‌బోతున్నాడు అనేది అర్థం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్ పుట్టిన రోజుకు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతుండ‌గా.. ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ న‌టుడు విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story