రాహుల్ గాంధీపై సైఫ్‌ అలీఖాన్‌ కీలక కామెంట్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురించి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ ప్రశంసలు కురిపించారు

By Srikanth Gundamalla  Published on  27 Sept 2024 6:40 PM IST
రాహుల్ గాంధీపై సైఫ్‌ అలీఖాన్‌ కీలక కామెంట్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురించి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ ధైర్యం ఉన్న నాయకుడు అని చెప్పారు. విమర్శలు ఎదురైనపపుడు ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసని చెప్పారు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’లో పాల్గొన్న సైఫ్ అలీఖాన్ ఈ కామెంట్స్ చేశాడు.

ధైర్యం, నిజాయితీ ఉన్న ఈ రాజకీయ నాయకుడిని తాను ఇష్టపడతానని సైఫ్ అలీఖాన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీరి ముగ్గురిలో భారత్‌ను భవిష్యత్తులోకి నడిపించగల ధైర్యమున్న రాజకీయవేత్త ఎవరని భావిస్తున్నారంటూ ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ముగ్గురూ ధైర్యవంతులేనని చెప్పిన సైఫ్.. రాహుల్ గాంధీపై మాత్రం ప్రశంసల జల్లు కురిపించాడు. గతంలో తనకు అగౌరవ పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు. కానీ.. అన్నింటీని రాహుల్ గాంధీ అధిగమించారని ప్రశంసించారు సైఫ్ అలీఖాన్.

రాహుల్ గాంధీ విధానం చాలా ఆకట్టుకునేలా ఉందని భావిస్తున్నట్లు సైఫ్ అలీఖాన్ పేర్కొన్నారు. ఒకానొక సమయంలో రాహుల్ మాట్లాడిన మాటలను, ఆయన పనులను జనాలు అగౌరవ పరిచారని గుర్తు చేసుకున్నారు. కానీ ఆయన బాగా కష్టపడి పరిస్థితులను మార్చివేవారని భావిస్తున్నట్లు సైఫ్ అలీ ఖాన్ చెప్పారు.

Next Story