ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Saif Ali Khan Aka 'Lankesh' Wraps Up His Part Of Shoot.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస చిత్రాల‌తో ప్ర‌స్తుతం పుల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2021 12:06 PM IST
ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస చిత్రాల‌తో ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో 'ఆది పురుష్' చిత్రం ఒక‌టి. భారీ బ‌డ్జెట్‌తో పౌరాణిక చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా.. సీతాదేవీగా కృతి స‌న‌న్ న‌టిస్తోంది. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సైఫ్ అలీఖాన్.. రావ‌ణుడిగా న‌టిస్తున్నారు. ముంబైలో ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేసి అందులో ఈ చిత్ర షూటింగ్‌ను చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. రావ‌ణుడి పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. లంకేశుడి పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్‌తో చివ‌రి రోజున కేక్ క‌ట్ చేయించి సెకాండ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సైఫ్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ లాంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగ‌స్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఎంతో గొప్ప‌గా ఉంద‌ని, ఆయ‌న ఓ జెంటిల్మెన్ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 11న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాకాలు చేస్తున్నారు.

Next Story