ఓ వైపు వివాదం.. మరో వైపు రికార్డుల దుమారం

Sai Pallavi Saranga Dariya Song Create Records. రెండువారాల కిందట విడుదలైన 'సారంగదరియా' సాంగ్ ను ఓ వైపు వివాదాలు చుట్టుముట్టగా.. మరో వైపు వ్యూస్ లో ప్రభంజనాన్ని చుట్టుముడుతూ ఉంది

By Medi Samrat  Published on  15 March 2021 3:59 PM IST
Sai Pallavi Saranga Dariya Song Create Records

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఈ సినిమా నుంచి విడుదలైన ఒక్కో పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రెండువారాల కిందట విడుదలైన 'సారంగదరియా' సాంగ్ ను ఓ వైపు వివాదాలు చుట్టుముట్టగా.. మరో వైపు వ్యూస్ లో ప్రభంజనాన్ని చుట్టుముడుతూ ఉంది. ఈ రిలీజ్ అయిన 14 రోజుల్లోనే యూట్యూబ్‏లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇంత తక్కువ కాలంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొదటి తెలుగు పాటగా సారంగదరియా నిలిచింది.


ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సారంగదరియా సాంగ్ 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ దాటేసింది . ఈ సాంగ్ కంటే ముందు తమిళ స్టార్ హీరో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన రౌడీ బేబి సాంగ్ కేవలం 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. బుట్ట బోమ్మ పాటకు 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడానికి 18 రోజులు పట్టగా… రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది.ఈ రెండు పాటల కంటే అతి తక్కువ సమయంలో 50 మిలియన్ దాటేసింది సారంగదరియా. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించారు. మంగ్లీ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో సాయి పల్లవి స్టెప్స్ సూపర్ అని అంటున్నారు. లిరికల్ వీడియోనే ఇంతగా నచ్చితే.. పూర్తీ డ్యాన్స్ ఉన్న వీడియోకు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ తప్పకుండా వస్తుందని భావిస్తూ ఉన్నారు.




Next Story