అభిమానులు చేసిన పనికి స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి
Sai Pallavi gets emotional on Shyam Singha Roy Pre release event.నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్
By తోట వంశీ కుమార్ Published on 19 Dec 2021 11:30 AM ISTనేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కథానాయికలుగా నటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మలయాళి ముద్దుగుమ్మ సాయిపల్లవి భావోద్వేగానికి గురైంది. ఆమె కన్నీరు పెట్టుకోవడం చూసిన ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురైయ్యారు.
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ అందరూ అరవడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయిపల్లవి ఎమోషనల్ అవుతూ సేజీమీదనే కన్నీరు పెట్టుకుంది. అనంతర సాయి పల్లవి మాట్లాడుతూ.. మొత్తం తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని చెప్పింది.' నా పై ఈరోజు అందరూ కురిపిస్తున్న ప్రేమను చూసి భావోద్వేగానికి గురవుతున్నాను. ఈ చిత్రం గురించి ఎంతో చెప్పాలని అనుకున్నప్పటికీ.. భావోద్వేగంతో మాటలు రావడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన సినీ పరిశ్రమకు, దర్శకులందరికీ ధన్యవాదాలు. ప్రతి సినిమాను కష్టపడి కాకుండా ఇష్టపడి చేశా. జాతీయ అవార్డు అందుకున్నప్పుడు కనీళ్లు పెట్టుకుంటానని అనుకున్నా.. కానీ ఓ నటిగా ఈ స్టేజ్‌పై ఉండడమే ఓ అవార్డు అని ఈరోజు నాకు అర్థమైంది' అని సాయి పల్లవి అంది. అందుకే తనకు కనీళ్లు వస్తున్నాయంటూ ఎమోషనల్ అయ్యింది. పక్కనే ఉన్న హీరో నాని ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు.
మలయాళ భామగా తెలుగుతెరకు పరిచయమైన సాయిపల్లవి.. ఫిదా చిత్రంతో అందరి మనసులను కొల్లగొట్టింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. శ్యామ్ సింగరాయ్ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.