భగభగ మండే త్రిశూల ధారియై.. సాయి పల్లవి ఉగ్రరూపం

Sai pallavi first look from Shyam singh roy. సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా సాయి పల్లవి శ్యామ్ సింఘరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. శుభాకాంక్షలు తెలిపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 11:03 AM GMT
Sai pallavi

సాంప్రదాయ చీరకట్టు.. ముక్కుకు ముక్కెర.. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు.. కణకణ మండుతున్న శూలం చేపట్టి నిప్పులు చెరుగుతున్న సాయిపల్లవి లుక్ ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ కేర‌ళ కుట్టి కోల్ కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న `శ్యామ్ సింఘరాయ్` చిత్రంలో న‌టిస్తోంది. నేడు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా సాయి పల్లవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. శుభాకాంక్షలు తెలిపింది. సాంప్రదాయ బెంగాలీ పట్టు చీరలో సాయి పల్లవి ఎంతో గంభీరంగా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడు. రాహుల్ సంకృతన్ దర్శకత్వంలో నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయిప‌ల్ల‌వితో పాటు కృతిశెట్టి క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది. మిక్కీజెమేయ‌ర్ స్వ‌రాలు అందించ‌నున్నారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ లో 10 ఎకరాల భూమిలో నిర్మించిన భారీ కోల్ కతా సెట్ లో శ్యామ్ సింఘా రాయ్ కీలక చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాలో నాని పాత్రతో పాటు సాయిపల్లవి పాత్ర ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయని టీమ్ చెబుతోంది.
Next Story