హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Sai Pallavi Emotional post on Sirivennela Sitarama Sastry last song.నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2021 3:07 AM GMT
హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగ‌రాయ్'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో చిత్ర బృందం వేగం పెంచింది. వ‌రుస‌గా ఈ చిత్రంలోని పాట‌ల‌ను విడుద‌ల చేసుకుంటూ వ‌స్తున్నారు. తాజాగా 'సిరివెన్నల' అనే రిలిక‌ల్ పాట‌ను విడుద‌ల చేశారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. అనురాగ్ కుల‌క‌ర్ణి పాడిన ఈ పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

కాగా.. ఈ పాట‌ను ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాశారు. ఇటీవ‌ల ఆయ‌న అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రాసిన చివ‌రి పాట ఇదే. దీంతో చిత్ర బృందంలో ఒక్కొక్క‌రు దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కూడా స్పందించింది. సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. 'మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తుంది. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు' అంటూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతంఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story
Share it