సర్జరీ సక్సెస్.. హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేసిన అపోలో వైద్యులు

Sai Dharam Tej Health bulletin release.రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ జూబ్లీహిల్స్ అపోలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sep 2021 8:55 AM GMT
సర్జరీ సక్సెస్.. హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేసిన అపోలో వైద్యులు

రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి పై వైద్యులు బులిటెన్‌ను విడుద‌ల చేశారు. సాయిధ‌ర‌మ్ తేజ్ కాల‌ర్ బోన్ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్తి అయిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ సర్జరీలో అనేక విభాగాలకు చెందిన వైద్యులతో కూడిన బృందం పాల్గొందని వివరించారు. ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని చెప్పింది. క్ర‌మంగా ఆయ‌న ఆరోగ్యం మెరుగుఅవుతున్న‌ట్లు వెల్ల‌డించింది. నిరంత‌రం ఆయ‌న ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఆ బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఈ నెల 10న(శుక్ర‌వారం) రాత్రి తీగ‌ల వంతెన వైపు నుంచి ఐకియా వైపు స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న సాయితేజ్ ప్రమాదవశాత్తు కిందపడి ప్ర‌మాదానికి గురైయ్యారు. తొలుత స్థానికులు మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆపై జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో సాయితేజ్ కు చికిత్స జరుగుతోంది. ప‌లువురు ప్ర‌ముఖులు ఆస్ప‌త్రిలో సాయిని ప‌రామ‌ర్శించారు.

Next Story