పుష్ప నుంచి 'సామి సామి' సాంగ్ విడుద‌ల.. ఈల వేయాల్సిందే

Saami Saami song release from Pushpa movie.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Oct 2021 6:08 AM GMT
పుష్ప నుంచి సామి సామి సాంగ్ విడుద‌ల.. ఈల వేయాల్సిందే

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన్నా న‌టిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప‌రాజ్ అనే స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో బ‌న్ని క‌నిపించ‌నున్నాడు. రెండు బాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తొలి భాగం డిసెంబ‌ర్ 17 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ఇప్ప‌టి నుంచే ప్ర‌యోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఈ చిత్రం నుంచి రెండు పాట‌లు 'దాక్కొ.. దాక్కో మేక', 'శ్రీవల్లి 'సాంగులు విడుదల చేయ‌గా.. యూ ట్యూబ్‌నే షేక్ చేస్తున్నాయి.

తాజాగా నేడు మ‌రో పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. 'నువ్వు అమ్మి అమ్మి అంటుంటే.. నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ నా సామీ' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్‌ను మౌనికా యాద‌వ్ ఆల‌పించింది. దేవీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళీ న‌టుడు ఫాజిల్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి ఈ పాట‌ను వినేయండి.

Next Story
Share it