నాటునాటు సాంగ్‌కు ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ కేరింత‌లు

RRR's Naatu Naatu wins first Golden Globes for Best Original Song.రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2023 7:59 AM IST
నాటునాటు సాంగ్‌కు ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ కేరింత‌లు

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. తాజాగా ఈ చిత్రం మ‌రో విశిష్ట పుర‌స్కారాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌ఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును (Golden Globe Awards)ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని "నాటు నాటు" పాట‌ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఉత్త‌మ సాంగ్‌గా ఎంపికైంది. కాలిఫోర్నియాలోని ది బెవ‌ర్జీ హిల్ట‌న్ హాల్ లో జ‌రుగుతున్న గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డుల కార్య‌క్ర‌మంలో రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, కీర‌వాణి లు కుటుంబ స‌మేతంగా పాల్గొన్నారు.

అతిరథ మహారథుల మధ్య సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. నాటు నాటు పాట‌కు అవార్డును ప్ర‌క‌టించే స‌మ‌యంలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిలు చ‌ప్పట్లు కొడుతూ సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా "ఆర్‌ఆర్‌ఆర్‌" సినిమా నామినేట్‌ అయింది.

ఈ సంద‌ర్భంగా ఎంఎం కీర‌వాణి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరి ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు త‌న‌ సోదరుడు ఎస్ఎస్ రాజమౌళికి చెందుతుంది అని కీరవాణి అన్నారు. తన‌ను సపోర్ట్ చేసినందుకు చిత్రనిర్మాతకి కృతజ్ఞతలు తెలిపారు. కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్‌, గీత రచయిత చంద్రబోస్ మ‌రియు పూర్తి స్టామినాతో డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లతో పాటు త‌న భార్య శ్రీవ‌ల్లికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Next Story