'ఆర్ఆర్ఆర్' కు మ‌రో అంత‌ర్జాతీయ అవార్డు

RRR wins Best International Feature at Sunset Circle Awards 2022.ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 2:29 PM IST
ఆర్ఆర్ఆర్ కు మ‌రో అంత‌ర్జాతీయ అవార్డు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్( రౌద్రం, ర‌ణం, రుధిరం)'. ఈ చిత్రం విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ప్ర‌భంజ‌నం సృష్టిస్తూనే ఉంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్ప‌టికే ప‌లు అవార్డుల‌ను ద‌క్కించుకున్న ఈ చిత్రం తాజాగా మ‌రో అవార్డును త‌న ఖాతాలో వేసుకుంది.

'సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్ 2022లో 'ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో విజేత‌గా నిలిచింది. ఈ చిత్రం మ‌రో నాలుగు అంత‌ర్జాతీయ చిత్రాల‌తో పోటీ ప‌డి ఉత్త‌మ చిత్రంగా ఎంపికైంది. ఉత్త‌మ ద‌ర్శ‌కుల విభాగంలో రాజ‌మౌళి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. ఇటీవ‌లే అమెరికాలో హాలీవుడ్ చిత్రాల‌కు ఇచ్చే శాట‌ర్న్ అవార్డు ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్' ను వరించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' కు ఆస్కార్ అవార్డు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు అభిమానులు.

Next Story