'ఆర్ఆర్ఆర్' అభిమానుల‌కి బిగ్ షాక్

RRR Trailer not release on December 3rd.సిని అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2021 4:44 AM GMT
ఆర్ఆర్ఆర్ అభిమానుల‌కి బిగ్ షాక్

సిని అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం, ర‌ణం, రుధిరం)' చిత్రం ఒక‌టి. ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. వ‌రుస‌గా అప్‌డేట్స్ ఇస్తూ దూసుకుపోతుంది. అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. దాదాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్ర‌క‌టించింది.

అయితే.. తాజ‌గా థియేట్రికల్ ట్రైలర్ ను వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. కొన్ని అనుకోని కార‌ణాల వల్ల వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది. ట్రైల‌ర్ విడుద‌ల‌కు సంబంధించిన కొత్త తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో ఈ చిత్ర ట్రైల‌ర్ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న అభిమానులు మ‌రికొంత కాలం ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story
Share it