తగ్గేదేలే.. ఆస్కార్ బరిలో ఉన్న‌ట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్‌.. ఆనందంలో అభిమానులు

RRR starts Oscars journey makers file nominations in 14 categories.ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం ప్ర‌క‌ట‌న వారిలో ఉత్సాహాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2022 2:45 PM IST
తగ్గేదేలే.. ఆస్కార్ బరిలో ఉన్న‌ట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్‌.. ఆనందంలో అభిమానులు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం 'ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)'. ద‌ర్శ‌కుడు దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల మ‌న‌సుల‌ను గెలుచుకుంది. సుమారు రూ.400 కోట్ల వ్య‌వ‌యంతో తెర‌కెక్కిన ఈ చిత్రం 1150 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి భార‌త‌దేశ ఖ్యాతిని న‌లుదిశ‌లా చాటింది.

కొద్ది రోజుల క్రితం ప్ర‌ముఖ హాలీవుడ్ మ్యాగ‌జైన్ వైరైటీ ఈ ఏడాది ఆస్కార్ బ‌రిలో 'ఆర్ఆర్ఆర్' ఉండే అవ‌కాశం ఉంద‌ని, దాదాపు ఐదు కేట‌గిరిల్లో అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. అప్ప‌టి నుంచి ఆస్కార్ బ‌రిలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఖ‌చ్చితంగా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ గుజ‌రాతీ చిత్రం 'చెల్లో షో' ను భార‌త‌దేశం త‌రుపున ఆస్కార్ నానినేష‌న్‌కు పంపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం ప్ర‌క‌ట‌న వారిలో నూత‌న ఉత్సాహాన్ని నింపింది.

ఆస్కార్ బ‌రిలోకి దిగితున్న‌ట్లు ప్ర‌క‌టించింది. "ప్ర‌పంచ బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో రికార్డుల‌తో భార‌తీయ సినిమా సత్తాని తెలియ‌జేసేలా ఆర్ఆర్ఆర్ కు ఘ‌న విజ‌యం అందించిన వారికి ధ‌న్య‌వాదాలు. గ‌త కొన్నినెల‌లుగా మాపై ప్రేమాభిమానాలు క‌న‌బ‌రుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆస్కార్ రేసులో పోటీ ప‌డేందుకు జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో మేము అప్లై చేశాం. మీ వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. ఇందుకు కృత‌జ్ఞ‌త‌లు " అని గురువారం సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం వెల్ల‌డించింది.

15 విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం పోటీ ప‌డనుంది.

కేటగిరీలు ఇవే:

బెస్ట్ మోషన్ పిక్చర్

బెస్ట్ డైరెక్టర్ - రాజమౌళి

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

బెస్ట్ యాక్టర్ : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగణ్

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్

బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎంఎం కీరవాణి

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్

బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు

బెస్ట్ సౌండ్ : (రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే)

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్.

Next Story