కొమురం భీమ్ బైక్ నడుపుతుంటే.. చిరున‌వ్వులు చిందిస్తున్న అల్లూరి

RRR shooting completed except two songs.సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2021 12:17 PM IST
కొమురం భీమ్ బైక్ నడుపుతుంటే.. చిరున‌వ్వులు చిందిస్తున్న అల్లూరి

సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వ‌చ్చినా అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో చాలా కాలంగా ఎలాంటి అప్‌డేట్ చిత్రబృందం ఇవ్వ‌లేదు. అయితే.. చెప్పాపెట్ట‌కుండా 'ఆర్ఆర్ఆర్' చిత్ర‌బృందం అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.

రెండు పాట‌లు మిన‌హా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొత్తం పూర్తి అయిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఇప్ప‌టికే రెండు బాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పూర్తి చేసార‌ని చెప్పింది. అంతేకాకుండా బైక్‌పై చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూర్చుని చ‌క్క‌ర్లు కొడుతున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొమురం భీమ్ బైక్ నడుపుతుంటే.. అల్లూరి వెనక కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు అంటూ నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరీస్ నాయిక‌లు. డీవీవీ దాన‌య్య నిరిస్తోస్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌.. అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. త్వ‌ర‌లోనే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

Next Story