గుర్రంపై చ‌ర‌ణ్‌.. బండిపై ఎన్టీఆర్‌.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

RRR release on october 13.ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'రౌద్రం రణం రుధిరం' ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2021 2:07 PM IST
RRR release on October 13

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్‌). కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు స్టార్‌హీరోల‌కు సంబంధించిన టీజ‌ర్‌ల‌ను విడుద‌ల చేశారు. అలియాభట్‌, ఒలివియోమోరిస్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను చిత్ర‌బృందం అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ కొత్త పోస్ట‌ర్ ను పంచుకుంది. గుర్రంపై రామ్‌చ‌ర‌ణ్‌, బులెట్‌పై ఎన్టీఆర్‌లు దూసుకుపోతున్న పోస్ట‌ర్ అభిమాల‌ను అల‌రిస్తోంది.


'అక్టోబ‌ర్ 13న నీరు నిప్పు క‌లిసి వ‌స్తున్నాయి. ఆ శ‌క్తిని మీరు ఇంత‌కు ముందెప్పుడూ చూసి ఉండ‌రు. భారతీయ సినిమాలో అతి పెద్ద క‌ల‌యిక అద్భుత‌మైన అనుభూతిని ఇచ్చేందుకు వ‌స్తోంద‌ని' చిత్ర బృందం ట్వీట్ చేసింది.దాదాపు రూ.400కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్‌దేవ్‌గ‌ణ్‌, శ్రియ‌, స‌ముద్ర ఖ‌ని కీల‌క పాత్ర‌లు పోషించారు.




Next Story