సీతారామరాజు మ‌హోగ్ర‌రూపం

RRR Ram charan look revealed.రేపు చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్బంగా 'ఆర్ఆర్ఆర్' నుంచి స్ట‌న్నింగ్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2021 10:48 AM GMT
RRR Ram charan look revealed

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు. ఇక రేపు చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్బంగా 'ఆర్ఆర్ఆర్' నుంచి స్ట‌న్నింగ్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సీతారామ రాజు మ‌హోగ్ర‌రూపం అంటూ ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. రామరాజుగా రామ్ చరణ్ కొత్త అవతారం చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ న‌టిస్తుంది.

ఇక ఇదే చిత్రంలో ఎన్టీఆర్ చిత్రంలో కొమురం భీంగా క‌నిపించ‌నున్నారు. కాల్ప‌నిక గాథ ఆధారంగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెర‌కెక్కుతోంది. ఓలివియా మోరిస్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Next Story
Share it