త‌గ్గేదేలే.. జ‌పాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ షురూ

RRR Promotions starts in Japan.ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2022 1:31 PM IST
త‌గ్గేదేలే.. జ‌పాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ షురూ

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్( రౌద్రం ర‌ణం రుధిరం)'. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల‌ను అల‌రించిన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ.1100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్లు సాధించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో హాలీవుడ్‌లో మెరిసిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచింది.

ఇదిలా ఉంటే.. ఇక ఇప్పుడు జ‌పాన్‌లోకి అడుగుపెట్టింది. జపాన్‌లో రేపు( అక్టోబ‌ర్ 21) విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే తెలుగు వ‌ర్ష‌న్‌ను స‌బ్ టైటిల్స్‌తో వీక్షించిన అభిమానులు జపనీస్ డ‌బ్బింగ్ వెర్షన్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం జపాన్‌కు వెళ్లింది చిత్ర బృందం.

ఇక ఈ రోజు జపాన్ మీడియాతో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ స‌ర‌దాగా ముచ్చ‌టించారు. సినిమాకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను వారితో పంచుకున్నారు. ఎన్టీఆర్ కి జపాన్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన డ్యాన్సులు, నటన జపాన్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఇక రామ్ చరణ్ కి కూడా గుర్తింపు ఉంది. జపాన్ ప్రేక్షకులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన చిత్రం కావ‌డంతో జ‌పాన్‌లో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తుంద‌ని అంటున్నారు.

Next Story