ఆస్కార్‌లో ఆర్ఆర్ఆర్ హవా..? ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్..?
RRR Nomination for Oscar 2023 Jr NTR can win Best Actor.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన
By తోట వంశీ కుమార్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)". విడుదలైన అన్ని బాషల్లో సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మార్చి 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడో ఒక చోట ఆర్ఆర్ఆర్ పేరు వినబడుతూనే ఉంది.
ఈ చిత్రంలో తారక్ కొమురం భీం పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ హవా కొనసాగించనుందని హాలీవుడ్ మ్యాగజైన్ తెలిపింది. మొత్తం నాలుగు కేటగిరీలో ఈ చిత్రం పోటీ పడే అవకాశం ఉందంటూ కథనాలు ప్రచురించింది. ప్రతియేటా ఉత్తమ నటీనటుల జాబితాను ముందే ప్రెడిక్ట్ చేసే "వెరైటీ" ఎడిషన్ అనే మ్యాగజైన్ వారు ఈ సారి కూడా ఆస్కార్ అకాడమీ అవార్డుల నామినేషన్‌లో ఎవరెవరు స్థానంలో దక్కించుకుంటారో చెప్పింది.
Our @tarak9999 is listed as a Possible Contender for 2023 Oscars BEST ACTOR Award by @Variety #RRRMovie @ssrajamouli pic.twitter.com/U8yfqlzWbr
— Dhanush 🧛 (@Always_kaNTRi) August 13, 2022
2023కు గాను బెస్ట్ యాక్టర్ విభాగంలో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరును ఎంపిక చేశారు. అలాగే.. ఉత్తమ చిత్రంగా "ఆర్ఆర్ఆర్", ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయ్యే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ మ్యాగజైన్ చెప్పింది నిజమైతే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.