'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

RRR Movie Trailer release on theaters.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 10:46 AM IST
ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం, ర‌ణం, రుధిరం)' ఒక‌టి. ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 7 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ రోజు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఒళ్లు గ‌గుర్పొడిచే యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్క‌బొడిచే స‌న్నివేశాలు, ప్రేర‌ణ నింపేలా సాగిన డైలాగ్‌ల‌తో ట్రైల‌ర్ ఆద్యంత‌రం అద‌ర‌హో అనేలా సాగింది. భీమ్‌.. ఈ న‌క్క‌ల వేట ఎంత సేపు.. కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొడదాం రా.. అంటూ రామ్‌చ‌ర‌ణ్ చెప్పే డైలాగ్‌లు ఈల‌లు వేయిస్తున్నాయి. ఈచిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడిగా బాలీవుడ్ ఆలియాభ‌ట్ క‌నిపించ‌నుండ‌గా.. తార్‌కు జోడిగా హాలీవుడ్ న‌టి ఒలీవియా మోరీస్ న‌టిస్తోంది. దాదాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర‌వాణి చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Next Story