'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ అప్‌డేట్..

RRR movie Trailer on December 1st week.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 7:26 AM GMT
ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ అప్‌డేట్..

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుథిరం) చిత్రం ఒక‌టి. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. దాదాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ న‌టి ఒలీవియా మోరీస్‌, చ‌ర‌ణ్‌కు జోడిగా బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి 'నాటు నాటు' పాట‌ను విడుద‌ల చేయ‌గా.. ఈ నెల 26న 'జ‌న‌ని' పాట‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు విలేక‌రుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వెల్ల‌డించారు. ఈ పాట ఈ చిత్రానికి సోల్ అని.. కీర‌వాణి అన్న‌య్య రెండు నెల‌లు ఈ పాట కోసం శ్ర‌మించార‌న్నారు. ఆయ‌నే ఈ పాట‌కు రిలిక్స్ కూడా రాసిన‌ట్లు తెలిపారు. ఇక డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌ను భారీగానే ప్లాన్ చేసిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే నెల‌లో వ‌రుస‌గా ఫ్రీ రిలీజ్ ఈ వెంట్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. చిత్ర‌బృందం మొత్తం త్వ‌ర‌లోనే అంద‌రి ముందుకు వ‌స్తుంద‌ని.. అప్పుడు ప్ర‌శ్న‌లన్నింటీకి స‌మాధానం చెబుతామ‌న్నారు.

Next Story
Share it