ఆర్ఆర్ఆర్ నుంచి తారక్‌ ఇంటెన్స్ లుక్ విడుద‌ల‌

RRR movie team reveals the new poster of NTR.తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ తో తార‌క్ అభిమానుల‌ను మ‌రోసారి ఫిదా చేసింది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 5:02 AM GMT
NTR from RRR

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. వాడి పొగ‌రు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీక‌ట్ల‌ని చీల్చే మండుటెండ‌. వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్యం ముద్దుబిడ్డ‌. నా త‌మ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్ అంటూ గ‌తేడాది రామ్ చ‌ర‌ణ్ వాయిస్‌తో ఎన్టీఆర్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ తో తార‌క్ అభిమానుల‌ను మ‌రోసారి ఫిదా చేసింది చిత్ర బృందం.

ఈ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ ప‌వ‌ర్‌పుల్‌గా క‌నిపిస్తున్నాడు. 'నా భీమ్ బంగారు హృదయాన్ని కలిగి ఉంది. అతను తిరుగుబాటు చేసినప్పుడు, అతను బలంగా మరియు ధైర్యంగా నిలుస్తాడు'. అని ఆ పోస్ట‌ర్ కింద రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెటింట్లో వైర‌ల్‌గా మారింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020 కాలెండర్ ఇయర్‌లో ఎన్టీఆర్ సినిమా అనేదే థియేట‌ర్‌లోకి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021లో కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనపడటం లేదు.

కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి. అయితే అభిమానుల‌ని ఇంత‌గా వెయిట్ చేయించినందుకు రానున్న రోజుల‌లో అదిరిపోయే ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిచేందుకు తార‌క్‌ సిద్ధంగా ఉన్నాడు.


Next Story