ఆర్ఆర్ఆర్.. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం

RRR Movie team shares interesting post goes viral.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆర్ఆర్ఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2021 2:40 PM IST
ఆర్ఆర్ఆర్.. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుథిరం) చిత్రం ఒక‌టి. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎన్నో సంచ‌ల‌నాలు, అనుమానాలకు తెర‌తీసిన ఓ ఫోటో.. రాజ‌మౌళి షేర్ చేసి నేటితో నాలుగేళ్లు నిండాయి. ఈ విష‌యాన్ని ఆస‌క్తిక‌ర పోస్ట్‌తో చిత్ర బృందం తెలియ‌జేసింది. స‌రిగ్గా నాలుగేళ్ల కింద‌ట అంటే 2017లో రాజమౌళి ఈ పిక్ పెట్టి ఎన్నో ఊహాగానాలకు నాంది పలికారు. ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మ‌రో 50 రోజుల్లో ఈ సినిమా మ్యాజిక్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ చేస్తున్నాం.. ఊహించని చిత్ర విచిత్రం… స్నేహానికి చాచిన హస్తం అని ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది చిత్ర‌బృందం. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. దాదాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఒలివియా మోరీస్‌, ఆలియా భ‌ట్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రియ‌, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ్‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story