కరోనాపై ఆర్ఆర్ఆర్ బృందం సూచనలు

RRR Movie team references on the corona. తాజాగా ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ ప్రజలకు సూచనలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 10:07 AM GMT
RRR movie team

భారతదేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! పలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని అంతం చేయొచ్చని పలువురు సెలెబ్రిటీలు చెబుతూ ఉన్నారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ ప్రజలకు సూచనలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి పలు నియమనిబంధనలు పాటించాలని ఆర్.ఆర్.ఆర్. చిత్ర బృందం కోరింది. దక్షిణాది భాషలతో పాటూ హిందీలో కూడా సూచనలు చేస్తూ వచ్చారు. ఆలియా భట్ తెలుగులో మొదలు పెట్టగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, రాజమౌళి కొనసాగించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రతి ఒక్కరూ మాస్కులను వేసుకోవాలని.. ఎంతో జాగ్రత్తగా ఉండాలని చిత్ర బృందం సూచించింది. వ్యాక్సిన్ పై వదంతులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండని.. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారిని ఈ దేశం నుండి పారద్రోలవచ్చని ఆర్.ఆర్.ఆర్. బృందం వీడియోలో తెలిపింది. ప్రస్తుతం దేశం ఎంతో ప్రమాదకరమైన శత్రువుతో పోరాడుతూ ఉందని.. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉంటూ తమ వంతు కృషి చేయాలని కోరారు.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ఉండడంతో సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు. ఇక సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది.


Next Story